![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు' (Podarillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -56 లో... మహాని సర్టిఫికెట్స్ ఇస్తానని పిలిచి శాశ్వతంగా ఇంట్లోనే ఉంచాలని ప్రతాప్, ఆది, లలిత ప్లాన్ చేస్తారు. మహా సర్టిఫికెట్స్ కోసం ఆశగా వాళ్ళ ఇంటికి వస్తుంది. కన్నా ఇంటి ముందు ఉంటాడు. మహా ఒక్కతే లోపలికి వెళ్తుంది.
సర్టిఫికెట్స్ తో ఏం చేస్తావ్ ఇక్కడే ఉండిపో.. ఆ ఇంట్లో నువ్వు ఎలా ఉంటావని లలిత అంటుంది. నా సర్టిఫికెట్స్ నాకు ఇస్తే వెళ్ళిపోతానని మహా అంటుంది. కుదరదని ప్రతాప్ అంటాడు. అదేంటీ ఇస్తాను అంటేనే కదా వచ్చిందని మహా అంటుంది. నిన్ను ఇక్కడే ఉంచడానికి పిలిచామని ఆది అంటాడు. దాంతో హారిక షాక్ అవుతుంది. ఇదంతా నాకు తెలియదు మహా అని హారిక అంటుంది.

నువ్వు ఇక్కడే ఉండిపోమని భూషణ్ కెనడాకి వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉన్నాడని ఆది అనగానే మహా కోప్పడుతుంది. నా సర్టిఫికెట్స్ నాకు ఇవ్వండి అని మహా అనగానే.. అది అవసరం లేదు.. దానికి సంబంధించినవి ఏం ఉన్నా తీసుకొని రారా అని ఆదితో ప్రతాప్ అంటాడు. దాంతో ఆది తీసుకొని వచ్చి వాళ్ళ నాన్నకి ఇస్తాడు. ఈ సర్టిఫికెట్స్ కావాలా.. ఈ ఇంట్లో ఉండడం కావాలా అని ప్రతాప్ అనగానే నాకు సర్టిఫికెట్స్ కావాలి.. నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయని మహా అనగానే ఈ సర్టిఫికెట్స్ మేం చదివించినవి అని ప్రతాప్ సర్టిఫికెట్స్ ని కాలుస్తుంటే మహాని ఆది ఆపుతాడు. హారికని లలిత ఆపుతుంది.
కాలిపోయిన సర్టిఫికెట్స్ చూసి మహా ఏడుస్తుంది. ఇంకా బయటకు వెళ్లి ఏం చేస్తావని ప్రతాప్ అంటాడు. నువ్వు కాల్చేసింది కేవలం సర్టిఫికెట్స్ మాత్రమే నా జ్ఞానాన్ని కాదని మహా అంటుంది. లలిత నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే మిమ్మల్ని నమ్మి వచ్చానని మహా ఏడుస్తుంది. నాతో మీకు ఇక ఎలాంటి సంబంధం లేదు.. నేను గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు మీరే నా గురించి గొప్పగా చెప్పుకుంటారని మహా అక్కడ నుండి బయటకు వస్తుంటే.. ఆది అడ్డుపడతాడు. దాంతో ఆదిపై మహా కోప్పడుతుంది. కన్నాపై ఆది కోప్పడుతుంటే వాడిని ఏం అనొద్దని మహా అడ్డుపడుతుంది.
ఆ తర్వాత మహా, కన్నా కొంచెం దూరం వస్తారు. మహా ఏడుస్తుంటే ఏమైంది వదిన అని కన్నా అడుగుతాడు. దాంతో మహా జరిగింది చెప్తుంది. తన బాధ పోగొట్టడానికి నాకు ఆకలిగా ఉందని కన్నా అంటాడు. ఇక దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి కన్నాని మహా తీసుకొని వెళ్తుంది. నాకు ఆకలిగా లేదు వదిన కానీ మిమ్మల్ని ఎలా ఓదార్చాలో తెలియక ఇలా చెప్పాను. మీరు ఏడిస్తే నాకూ ఏడుపొచ్చింది. మీరు వదినమ్మ కదా అంటే అమ్మ అని అమ్మ ఏడిస్తే ఏడుపు రాదా అని కన్నా అంటాడు. అప్పుడే చక్రి ఫోన్ చేసి మాట్లాడతాడు. వస్తున్నామని మహా, కన్నా అనగానే చక్రి కూల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |